తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు.
మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుధారాణి మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవాలి అని చూస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పుడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతికి కేసీఆర్‌కి రాఖీ కట్టిన సందర్భంలో దొర అనే పదం గుర్తు రాలేదా అని సుధారాణి ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు సంపాదన పథకాలుగా విజయశాంతికి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. రాములమ్మగా మహిళకు ఇచ్చే చీరలను అడ్డుకోవడంపై ఆమె స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఓట్లు రావని టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా తెలంగాణలో అమలు చేశామన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో చేనేతలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు కట్టుకునే చీరల పై రాజకీయం కరెక్ట్ కాదని ఆమె తప్పుపట్టారు.
Post Views: 332