శ్రీకాకుళం జిల్లా దవళపేట గ్రామంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరాయి. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. మాజీ సైనికుడు, టీడీపీ సీనియర్ నాయుడు బొడ్డేపల్లి ఆనందరావు, పేడాడ స్వామినాయుడు, బెండి రమణ,పేడాడ అమ్మడు, పేడాడ ఈశ్వరరావు, కంచరాన అన్నారావు, కంచరాన రాజు, పేడాడ ముకుందరావు, పేడాడ చంద్రరావు, కంచరాన అప్పలసూరి, ఎన్ని సూరి, కేత రాజారావు, బెండి చంద్రరావు, పేడాడ సింహాచలం, కంచరాన అప్పలసూరి, మొదలవలస నారాయణరావు, కంచరాన శ్రీను, బొడ్డేపల్లి మధుసూదనరావు, బగాది మోహనరావు, వీరగొట్టాపు కొండలరావు, వీరగొట్టాపు మోహనరావులతోపాటు మరో కొన్ని కుటుంబాలు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరికి గొర్లె కిరణ్ కూమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేస్తామన్నారు.ఇన్నిరోజులు టీడీపీ ప్రజలను ఆదుకునే పార్టీ అనుకున్నాం కాని ప్రజలను ముంచ్చేసే పార్టీ అని వాళ్ళు చెప్పారు.జగన్ వస్తే రాష్ట్రంలో కష్టాలు తొలిగిపోతాయని ప్రజలు చెప్పుకొచ్చారు.కార్యక్రమంలో మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మీసాల వెంకటరమణ, బూత్ మేనేజర్ అబోతుల జగన్నాథం, మాజీ సర్పంచ్ పేడాడ రాజారావు, వడిశ మహేశ్వరరావు,దుంపల రామ్మోహనరావు, పేడాడ సూరన్నాయుడు, పేడాడ బాలయ్య పాల్గొన్నారు.