ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మహా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 11 దేశాల నుంచి కంపెనీలు హాజరుకానున్నాయి. 365 మల్టీనేషన్ కంపెనీలు పాల్గొననుండగా… 35 వేల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 11 దేశాల నుంచి వివిధ కంపెనీలు హాజరుకానున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్, ఏరోనాటిక్స్, మేకానికల్, హెల్త్ కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్…. ఇలా అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు హాజరుకావచ్చు.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఈ మహా ఉద్యోగ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాకు ఎలాంటి ఫీజు లేకుండా హాజరుకావొచ్చు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఈ మహా జాబ్ మేళా నిర్వహించనున్నారు.