నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్‌ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందని అధికారం మాకిచ్చారు.
నాడు అన్ని సంక్షోభాలే. వలసలు, కరువులు, శిథిలమైన చెరువులు, మూలన పడ్డ చెరువులు. ఈ పరిస్థితి జూన్ 2, 2014 నాటిది. గుడ్డివాళ్ల లాగా మద్దతిస్తున్నాం. రాజకీయ చైతన్యం తప్పనిసరి అని చెప్పినాను. కరెంట్ కష్టాలతో సతమతమవుతున్న సమయంలో మూడు తీగలకు కరెంట్, టీడీపీ, కమ్యూనిస్టు జెండా కట్టమని చెప్పితే మీరు చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ జెండాలను నేలకేసి కొట్టినందుకే ఈనాడు గులాబీ జెండా 24 గంటల కరెంట్ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.