ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త కలవరం మొదలైంది. తన నమ్మినబంటు అయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో బాబులో ఆందోళన మొదలై పలు నిర్ణయాలుతీసుకున్నట్లు చెప్తున్నారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుండగా… మరోవైపు అమరావతిలో మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు చేసే అవకాశం లేకపోలేదని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. సీఎం మీదే కాకుండా… మంత్రులనూ టార్గెట్ చేసేలా కేంద్రం కుట్రలు పన్నుతోందన్న ప్రచారం జరుగుతోందని ఓ మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు సమాచారం.
కాగా, ఐదు గంటలుగా రేవంత్ రెడ్డి ఐటీ అధికారులు విచారించారు. రేవంత్ సమాధాలను ఐటీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. అధికారులు 30 నిమిషాల పాటూ భోజన విరామం ఇచ్చారు. కాగా, ఈ ఎపిసోడ్‌పై ఏపీ పభుత్వ పెద్దలు కలవరపాటుకు గురయ్యారు. రేవంత్ రెడ్డి విచారణ పరిణామాలపై తెలంగాణా IT కార్యాలయం వద్ద ఏపీ ప్రభుత్వ ఆరా తీస్తోంది. ఐటీ కార్యాలయం పరిధిలో ఏపీ ఇంటలిజెన్స్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇలా ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు కారణం ఈ ఎపిసోడ్‌లో తమ మెడకు చుట్టుకోనుందనే భయమే కారణమని అంటున్నారు.