రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది.
మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల సంక్షేమం పట్ల చాలా బాగా కృషి చేస్తుందని, ముఖ్యంగా గల్ఫ్ ఎన్నారై బిడ్డల సంక్షేమానికి, అన్ని సందర్భాల్లో ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ధతో పని చేసేలాగా సూచనల – సలహాలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లోని వివిధ రంగాల్లో తీసుకురావాల్సిన నూతన విధానల పై కూడా వీలైనన్ని సలహాలిచ్చామని తెలిపారు.
అలాగే గత రెండు రోజులుగా కే.టీ.ఆర్ చొరవతో, మహేష్ బిగల సారధ్యంలో ఎంతో మంది గల్ఫ్ బిడ్డలు స్వరాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు.ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఫోన్ ద్వారా మీడియా కి తన సందేశాన్నిస్తూ, ఈ నివేదికను సిద్ధం చేయడానికి సహకరించిన అంతర్గత మేనిఫెస్టో కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి (చైర్), రవి ప్రదీప్ పులుసు, సతీష్ రెడ్డి బండ, రమేష్ ఎసెంపల్లి, సురేష్ బుడగం, రవి రేతినేని, సురేష్ గోపతి మరియు వీటిని పర్యవేక్షంచిన అనిల్ కూర్మాచలం, శ్రీకాంత్ పెద్దిరాజు, రత్నాకర్ కడుదుల మరియు సిక్కా చంద్రశేఖర్ లకు కృతజ్ఞత తెలిపారు. నివేదికలోని అంశాలని పరిశీలించి రాబోయే మానిఫెస్టోలో చేర్చాలని కేశవ రావు గారికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు .