తెలంగాణ ఉద్యమంలో కాస్తో కూస్తో పని చేశాడు. ఆ మాత్రం దానికే రాష్ట్రానికే సీఎం కావాలని కల కన్నాడు. అనుకున్నదే తడవుగా వెనకా ముందు ఆలోచించకుండా పార్టీ పెట్టాడు. ఆయనే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ముష్టి మూడు సీట్ల కోసం అన్ని పార్టీల తోక పట్టుకొని తిరగడం ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్నది. ఇన్నాళ్లు ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా, ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ఇష్టారీతిగా అడ్డగోలు విమర్శలు చేసిన కోదండరాం ఇప్పుడు సీట్ల వేటలో బిజీ అయ్యారు. మహా కూటమిలో చేరుతానని ఓ సారి, బీజేపీతో జత కడుతానని ఓసారి మీడియాకు లీకులు ఇస్తున్నారు. కోదండరాంకు ఉన్న బలమేపాటిదో అన్ని పార్టీల వారికి అర్థమవటంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి కూరలో కరివేపాకులా మారింది. నాడు కోదండరాం మాట్లాడితే మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో వేసిన కొన్ని పత్రికలు సైతం ప్రస్తుతం ఎక్కడో సింగిల్ కాలం వార్తగా ఇస్తున్నాయి.
తెలంగాణ ద్రోహులుగా ప్రజలు నమ్మే టీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించడంతోనే కోదండరాం పతనం ప్రారంభమైంది. పదో పరకో ఉన్నవెనక ఉన్న వారు సైతం దూరమయ్యారు. దీంతో వచ్చే ఎన్నికలు కోదండం రాం ఉనికికి పరీక్షలా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. తన శక్తి తనకు తెలుసు కాబట్టే కేవలం మూడు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకన్నారని, అలా కాకుండా అన్నింటా పోటీ చేసి డిపాజిట్లు కోల్పేతే పరువు పోగొట్టుకున్నట్లుగా ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.. అసలు ఆయన పోటీ చేసిన స్థానం నుంచైనా గెలుస్తారా.. ఓటమి పాలైతే భవిష్యత్‌లో కోదండరాం ఏం చేస్తారో.. ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లో సమాధానం రానుంది.