తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేదని, ఎన్నికల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రధానదికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే ఈ సమాచారంతో తెలంగాణలో అందరూ సంతోష పడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఎంతగానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ సకాలంలో జరిగితే, అది కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేస్తుందని సీనియర్లు సైతం భావించడమే ఇందుకు కారణం.
నిజానికి ఈ పథకాలను ఎలా అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసైనా నిలుపుదల చేయాలని భావించారు. అయితే సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో రజత్‌కుమార్ స్వస్టతనిచ్చారు. రైతు బంధు, బతుకమ్మ చీరల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు లేవని తేల్చి చెప్పారు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మరోసారి తలలు పట్టుకుంటున్నారు