ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 ఓవర్లలో 223 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ నిజానికి గెలిచినంత పని చేసింది.
ఆసియా కప్ ను గెలుచుకోవాలనే బంగ్లాదేశ్ లక్ష్యం మూడో సారి కూడా విఫలమైంది. గతంలో ఓసారి పాకిస్తాన్ పై, రెండో సారి భారత్ పై ఫైనల్లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచులోనూ బంగ్లాదేశ్ చివరి వరకు వీరోచితంగా పోరాడి ఓడిపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జాదవ్ 2, బుమ్రా1, చాహల్ 1 వికెట్ తీసుకున్నారు. జడేజా, భువనేశ్వర్లకు వికెట్లేవీ దక్కలేవు. బంగ్లా మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే ఆలౌటయ్యింది.