ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, చాహల్ మళ్లీ టీమ్‌లోకి వచ్చారు. లోకేశ్ రాహుల్ స్థానంలో దినేష్ కార్తీక్ టీంలోకి వచ్చాడు.
బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. మోమినుల్ హక్ స్థానంలో నజ్ముల్ ఇస్లామ్ తుది జట్టులోకి వచ్చాడు. బంగ్లా కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ..‘ఫైనల్ చేరిన క్రెడిట్ అంతా మా ఆటగాళ్లదే. కొన్ని మ్యాచుల్లో వారి ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ రోజు చివరిబంతి వరకు పోరాడుతాం. మా జట్టులో స్పిన్నర్ లేడు. దానికోసం జట్టులోకి నజ్ముల్ ఇస్లామ్‌ను తీసుకున్నాం. మాకు మంచి అవకాశం ఉంది. వారిది నెం1 జట్టు. వాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఇది మేం అందిపుచ్చుకుంటే మాకు అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ నెగ్గాలని భారత్ భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సంచలనం సృష్టించాలని బంగ్లా భావిస్తోంది.