ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి సదస్సు లో పాల్గొన్నారు.కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఎలా అయితే కృషి చేస్తున్నారో తమ వంతు బాధ్యతగా తెలంగాణకు టూరిజం , టెక్నాలజీ రంగాల అభివృద్ధి మరియుమరిన్ని పెట్టుబడులు , ఉపాధి కల్పనా కోసం వివిధ కంపెనీ ల ప్రతినిధులను కలుసుకోవడం జరిగింది అని విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు.
వివిధ న్యూ జీలాండ్ కంపెనీల ప్రతినిధులు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తెలంగాణకు రావడానికి అంగీకారం తెలిపారని అన్నారు .కళ్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయం , పండుగలు , భాష ల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నదని అలాగే తెలంగాణ మరింత ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం తెలంగాణ బ్రాండ్ అంబాసడార్ గా ఈ సదస్సు కు హాజరు కావడం జరిగింది అని తెలిపారు .ఈ సమ్మేళనంలో , భారత రాయభారి సంజీవ్ కోహ్లీ , భావ దిల్లోన్ , న్యూ జీలాండ్ కాబినెట్ మంత్రులు జెన్నీ సలేసా , ఆండ్రూ లిటిల్ ఎంపీ లు ప్రియాంకా రాధాకృష్ణన్ , కాన్వాల్జిత్ సింగ్ భక్షి మరియు ఫిక్కీ తరపున సురేష్ నాయిర్ మరియు దాదాపు 200 మంది ఇండియా , న్యూ జీలాండ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.