ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకుని విజయనగరానికి చేరింది. కాగా నిన్న (సోమవారం) వైఎస్ జగన్ ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) 270వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస లోని తుమ్మికపాలెం నుండి వైఎస్ జగన్ ప్రారంభించారు.
అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ కు ఘణ స్వాగతం పలికారు. జగన్ పాదయాత్రతో ఆ మార్గమంతా జనసంద్రమైనది. జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, తమ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా నేటి ప్రజసంకల్పయాత్ర అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుపుడి జంక్షన్, లక్కవరపుకోట మండలం మల్లివీడు, గోల్డ్‌స్టార్ జంక్షన్, జమ్మాదేవి పేట, రంగాపురం క్రాస్, రంగరాయపురం వరకు కొనసాగుతుంది.