తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌గా వెళుతున్న టీఆర్ఎస్పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్పై విమర్శలు చేశారు.
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం స్వార్ధంతో అందకుండాపోతుంది.టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్థ ఆలోచన కారణంగానే అక్కడి ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారని ఆరోపించారు.ప్రజలు టీఆర్ఎస్ను నిలదీయాలని అమిత్ షా ట్వీట్లో పేర్కొన్నారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అమిత్ షా గారు తెలంగాణలో మీ కార్యక్రమం కంటే చాలాకాలం నుంచి అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 80లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం.మీ కార్యక్రమం రాష్ట్రంలో 25లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు.