బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాలో పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడానికి కమిటీ సూచనలు అందించాలని తెలిపారు. అంతేకాక ఢిల్లీ, ముంబయలో హోల్డింగ్‌ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కమార్ తెలిపారు.