ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అక్కడ రావి చెట్టు మొక్కను జగన్ నాటారు. గత ఎడాది (2017 )నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటితో 269 రోజులకు చేరుకుంది . దాదాపుగా 11 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని 12వ జిల్లాలో అడుగుపెట్టింది. ప్రజాసంకల్పయాత్ర ద్వారా జగన్ పాదయాత్రలో ప్రజల సంక్షేమం , యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏన్నో కష్టాలు, నష్టాలు, కన్నీళ్లే జీవితంగా బ్రతికే ప్రతి పేదవాడి కళ జగన్ ముఖ్యమంత్రి కావాడం. అందుకే ప్రతి రోజు జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు.పాదయాత్రలో ఆయన వేసిన ప్రతి అడుగూ తెలిపింది ప్రతి పేదవాడి గుండె చప్పుడు. రాష్ట్రంలో ఏ ఊరెళ్లినా జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న తీరు చూస్తుంటే ఆయన మీదున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతుంది. ఏ పేదవాడ్ని కదలించినా జగన్ వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టమొచ్చిన రైతన్నను , కన్నీళ్లు పెట్టిన నిరుపేదలను, ఆప్యాయంగా పలకరించే చెల్లెమ్మలను జగన్ దగ్గరకు తీసుకుంటున్న సన్నివేశాలు పాదయాత్రలో ప్రతీ అడుగడుగునా కనిపిస్తున్నాయి. కష్టాలతో వచ్చిన వారి కష్టాలు వింటూ వారి కన్నీరు తుడుస్తూ రాజన్నరాజ్యం త్వరలో వస్తుంది మీ కష్టాలన్ని తీరుతాయి అంటూ భరోసా ఇస్తున్నారు.
కురుపాం నియోజకవర్గం వైసీపీ ఎమెల్యే పుష్పా శ్రీవాణి:-
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 3000 వేల కి.లో. చేరుకుంటున్న సందర్భంగా కురుపాం నియోజకవర్గం వైసీపీ ఎమెల్యే పుష్పా శ్రీవాణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 3000 వేల కి.మీ చారిత్రక ఘట్టం అందుకున్న విజయనగరమే జగన్ విజయానికి నాంది అని తెలిపారు. జగన్ కోసం జగన్-జనం కోసం జగన్ అని తెలియజేశారు. చరిత్ర రాయాలన్నా ఆ చరిత్ర తిరగరాయాలన్నా అది వైయస్సార్ కుటుంబానికి మాత్రమే సాధ్యం అని ఎమెల్యే పుష్పా శ్రీవాణి తెలిపారు. అలాగే చంద్రబాబునాయుడి తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం ఇక్కడినుండే పాడబోతున్నామని తెలియజేశారు.