ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లా విజయనగరం లోకి ప్రవేశించింది. విశాఖ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ సోమవారం విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకున్నారు.
జగన్ అక్కడికి చేరుకోగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసద్రమైంది. చింతలపాలెంలో వైఏస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పాదయాత్ర ప్రారంబించారు. నేడు 269వ రోజు పాదయాత్రతో జగన్ 3000 మైలురాయిని అందుకోనున్నారు.