ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతూ నేడు 268వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు.
వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలంతా జగన్ తో పాటు అడుగులు వేస్తున్నారు. జననేత అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమ పార్టీ అధికారం లోకి రాగానే కష్టాలన్నీ తొలగి పోతాయని వారికి భరోసా ఇస్తున్నారు.
గండిగుండం కాలనీ వరకు పాదయాత్ర కొనసాగిన తర్వాత జననేత పాదయాత్ర పెందుర్తి నియోజకర్గంలోకి చేరుతుంది. పెందుర్తి నియోజకవర్గంలోని అక్కిరెడ్డి పాలెం, జుట్టాడ క్రాస్ మీదుగా పాత్రులునగర్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం భోజనం విరామం తర్వాత 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అనంతరం రాయవరపువాని పాలెం మీదుగా సారిపల్లి వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.