వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు వేలం వైపు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే. బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగు బంగారమైన విషయం తెలిసిందే.బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది.ముందుగా రూ. 1,116 లతో వేలం పాట ప్రారంభమైంది. ఆ తర్వాత వేలం పాట ధర పోటా పోటీగా కొనసాగింది. చివరకూ ఆర్యవైశ్య సంఘానికి చెందిన శ్రీనివాస్ గుప్తా రూ.16.60వేలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.
గత ఏడాది కంటే లడ్డూ ధర ఈసారి లక్ష రూపాయలు పెరిగింది.భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం పాట కన్నుల పండుగగా జరిగింది.బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైనప్పటికీ అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ… 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది.ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ లడ్డూ కోసం 30మంది పోటీదారులు బరిలో ఉన్నారు. కాగా లడ్డూ వేలం ప్రారంభించి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తి అయింది.ఈ ఏడాది