ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ 18,450 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో ఉపాధ్యాయ పోస్టులతోపాటు, గ్రూప్స్, పోలీసు, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు డీఎస్సీ నియామక పోస్టుల భర్తీకి మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖమంత్రి ఘంటా శ్రీనివాసరావు తెలిపారు.
నియామకాలను ప్రతిభ ఆధారంగా, ఇంటర్వూలు లేకుండా, చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తిగా పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్‌లో పాఠశాల విద్యాశాఖతో పాటుగా మున్సిపల్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 9,275 ఉంటాయని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు. గత నాలుగేళ్ళుగా నోటిఫికేషన్ విడుదల చేయని చంద్రబాబు మరో ఆరు ఏడు నెలల్లో వస్తున్న ఎన్నికల నేపధ్యంలో కొన్ని వేల పోస్ట్ లు ఖాళీగా ఉన్నా, తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ నిడుదల చేయడం పై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.