మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2010 జూలై 16వ తేదీన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టె సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు.అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు తరపు న్యాయవదులు సుబ్బారావు, హనుమంతరావులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు కు ఇచ్చిన వారంట్ ను ఉపసంహరించాలని, ఆయన హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. వారి వాదనలు విన్న తర్వాత కోర్టుదానిని తోసిపుచ్చింది.
చంద్రబాబుతో పాటు ,మిగిలిన నేతలు కూడా తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. తాము అందరికి ఒకే విధమైన న్యాయం అమలు చేస్తామని కోర్టు పేర్కొంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్‌పై తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు.ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు అవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అక్టోబర్ 15కు ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబుతో పాటు మిగిలిన 16మంది అక్టోబర్ 15న కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.