ఆంధ్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికలలో ప్రతి పక్షంలోఉన‌్న వైసీపీ పార్టీ వంద సీట్లకు పైనే గెలుచుకునే అవకాశం ఉందని… ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారని సర్వేలు పటా పంచాల్ చేశాయి. అయితే సర్వ చేసింది ఎవరో కాదు అధికార తెలుగుదేశం పార్టీకి అనుచరులైన పచ్చ పత్రికలేనని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పరిస్థితి ఎలా ఉందో ఓ పచ్చ మీడియాతో రహస్య సర్వే జరిపించారట.ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో అన్ని విధాలుగా టీడీపీ ప్రభుత్వం వెనుకబడి ఉందని – బాబు పాలన పట్ల ఏ వర్గంలోను సంతృప్తి లేదని సర్వే వివరాల ద్వారా తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దందా ప్రభావం వల్ల రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర వ్యతీరేకత ఉందని తెలుస్తుంది. మంత్రుల మధ్య వివాదాలు – పార్టీ నాయకుల మధ్య అనైక్యత పెరిగిపోయిందని పచ్చ మీడియా సర్వేలో తెలిందని సమాచారం. కోస్తా, రాయలసీమతో జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత నానాటికి ఎక్కువవుతోందట. ఈ పచ్చ మీడియా సర్వే ఆధారంగా రానున్న ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 నుంచీ 130 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసిందట. జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన ఎక్కువగా ఉండడం వెనుక ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు.
