గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను 9 గెల్చామని, వచ్చె ఎన్నికల్లో జహీరాబాద్ కలుపుకుని పదింటికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోను గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని మంత్రల నివాస సముదాయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో, నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నేతృత్వంలో మెదక్ జిల్లా నర్సాపూర్ తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత రమణరావు, ఆయన అనుచరులు, తాజా మాజీ వార్డు మెంబర్లు జమాలుద్దీన్, రాంచందర్,గడ్డం దశరథ, ఆంజనేయల్ గౌడ్, నాయిని రమేష్ హత్నూర మండలం మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నేతృత్వంలో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందినట్లు మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు. తెరాస ప్రభుత్వంమే ఎన్నో ఎళ్ల నర్సాపూర్ వాసుల కల అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ఆ పనులు సాగుతున్నాయని మంత్రి చెప్పారు. నర్సాపూర్ లో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు విివరించారు. పది చెక్ డ్యాంల నిర్మాణాాన్ని తెరాస ప్రభుత్వమే చెపట్టిందన్నారు.. నర్సాపూర్ నియోజకవర్గాన్ని శ్రద్ధతో ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆ దిశగా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో 80 వేల ఎకరాలకు సాగు నీరుఇవ్వనున్నట్లు చెప్పారు. 80 వేల ఎకరాలతో పాటు మరింత ఎక్కువ పొలాలకు నీరు పారేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తామన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా తాను శ్రద్ధ వహిస్తానని మంత్రి హరీష్ రావు చెప్పారు.
పార్టీ కోసం కష్టపడండి….
———————-
ఈ రెండు నెలలు పార్టీకోసం గట్టిగా కష్టపడాలని, ఆ తర్వాత తాము ఐదేళ్ల పాటు మీ కోసం పని చేస్తామని మంత్రి హరీష్ రావు కొత్తగా చేరిన నేతలు, కార్యకర్తలను కోరారు. కొత్తగా పాార్టీలో చేరిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. వచ్చె ఎన్నికల్లో కారు జోరు ఏ మాత్రం తగ్గదన్న ఆయన వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల్లో పది సీీట్లకు 9 సీట్లు గెల్చామని, కాంగ్రెస్ ఖాతాలో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఈ సైతం ఎ న్నికల్లో చెజిక్కించుకుని పదికి పది సీట్లతోతెరాస సంపూర్ల విజయం సాధిస్తుందన్నారు. అభివృద్దికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ ను వీడి బంగారు తెలంగాణ సాధనకు తెరాసలో చేరే నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు , విద్యుత్ ప్రాజెక్టులకు,ఇతర అభివృద్ధి పనులకు ఏదో రూపంలో కాంగ్రెస్ ఆటంకాలు సృష్టిస్తుందన్నారు. అధికారం పీఠం దక్కదన్న దుగ్థతో ఆటంకాలు కలిగిస్తోన్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయాలే తప్ప ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అలాంటి నేతలు మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని…వారి మోసాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారన్నారు.