ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం గాజువాకలో శ్రీ కన్య సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్లో పై భాగంలో మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో రెండు థియేటర్లు పూర్తిగా తగలబడిపోయాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగ దట్టంగా పరుచుకుంది.
దీంతో థియేటర్ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. థియేటర్‌పైన సెల్ టవర్స్ కూడా ఉండటంతో వారు మరింత భయాందోళన చెందారు. ఈ ప్రమాదంలో మూడు కోట్లు ఆస్తి నష్టం జరిగనట్టుగా తెలుస్తోంది.