రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. గ్రామాలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని సకల జనులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.కులసంఘాలు అండగా ఉంటున్నాయి.
మహిళా సమాఖ్యలు మద్దతు పలుకుతున్నాయి. సబ్బండవర్గాలు ఆశీర్వదిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తాం.. ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తాం అనే వాల్‌రైటింగ్‌తో కొత్త ట్రెండ్‌కు తెరలేపారు టీఆర్‌ఎస్ అభిమానులు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేస్తున్నామో కారణాలను సైతం విశ్లేషిస్తున్నాయి. ఓ వైపు గులాబీ అభ్యర్థులు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుంటే.. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి.
తాజాగా టీఆర్‌ఎస్ అభిమానులు గోడరాతలతో అభిమానం చాటుతున్నారు. మా ఇంటి ఓట్లన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికే నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కేంద్రంలో ఓ వాల్‌రైటింగ్ ప్రత్యక్షమైంది. మా ఇంటి ఓట్లన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుగారికే వేయబడును అని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో మరో వాల్‌రైటింగ్ దర్శనమిచ్చింది. ఈ కొత్త ట్రెండుతో విపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.