తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.అయితే ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.పొత్తులో భాగంగా సీనియర్ నేతల సీట్లు కోల్పోనప్పటికీ…తమ తమ అనుచరులకు టికెట్లు దక్కవనే ఉద్దేశంలో పొత్తులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నారు పొత్తులతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని, అధికారం కోసం పొత్తులు అవసరమని చెప్పినట్టు తెలిసింది.