చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు .
బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో జరిగినదని , అప్పటి ప్రభుత్వంలో కేసులు పెడితే దానికి టీఆర్ఎస్ పై ఆరోపణలు చేయటం తగదని ఆయన మండిపడ్డారు. బాబ్లీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో టీడీపీల పొత్తు పెట్టుకుందని దుయ్యబుట్టారు.టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఆరు నెలల క్రితమే కుదిరిందని ఆయన మీడియాతో అన్నారు. పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారని అన్నారు. పొత్తుల మూలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.