తెలంగాణలో ప్రభుత్వ పాలనలో ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలుగా వాడుతోంది. అయితే కొన్ని చోట్ల వీరి ప్రచారమేమీ అవసరం లేకుండానే టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష మద్దతు లభిస్తోంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తమ గ్రామస్తులంతా ఓటేస్తామని మానుకొండూరు నియోజకవర్గంలోని చీలపూర్ పల్లి, ఎర్రవెల్లివాడ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇక మాకు పార్టీలు లేవు మేమంతా టీఆర్‌ఎస్ పార్టీనే అంటూ ఆ గ్రామమంతా ఒక్కటే నినాదం చేసింది. మేమంతా టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తామంటూ మూకుమ్మడిగా చెప్పారు. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటామన్నారు.ఈ వార్త టీఆర్ఎస్ శ్రేషుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ గ్రామాలు గతంలో వేరే పంచాయితీల ఆదీనంలో ఉండేవి.ఎన్నో దరఖాస్తులు పెట్టాం..! గ్రామానికి వచ్చిన ప్రతి నాయకునికి మొర పెట్టుకున్నాం..! మా గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నం..! దశాబ్దాల కాలంగా మొర పెట్టుకున్నా మోక్షం కలుగలేదు..! అయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయితీల్లో వీటికి కూడా స్థానం లభించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు మాత్రమే ఈ సారి ఓట్లు వేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు .అందువల్ల తమ ఊరికి ఓట్ల కోసం ఇతర పార్టీల నాయకులు రావద్దని బ్యానర్లు పెట్టి టీఆర్ఎస్ పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు.