రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.ఈనెల 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలించనున్నట్టు చెప్పారు.
ఏడు జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఈసీ గుర్తించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందన్నారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి కాల్ డెస్క్‌కు 30 లైన్స్ అనుసంధానిస్తామన్నారు.
సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపైనా నిఘా ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు.