సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్ విలేకరులతో మాట్లాడారు.నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.పవన్ కల్యాణ్ తండ్రిలాంటి వారని పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ మధ్య కాలంలో బండ్ల గణేష ఒక కేసులో కోర్టుకు వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే.అయితే కేసులకు భయపడి తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. సినిమా అంటే ప్రాణం… రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నట్టు ఆయన చెప్పారు.అయితే తానెంతో అభిమానించే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లోకి ఆయన రావడం చర్చనీయాంశంగా మారింది.