తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజ్‌తక్‌లో ప్రసారమైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్రబాబు వెనకబడ్డారు. తెలంగాణలో సీఎం పనితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ పడగా… ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఏపీలో సీఎం పనితీరు అంశంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బెస్ట్ నాయకుడిగా జగన్‌కు అత్యధిక మార్కులు పడ్డాయి. ఇపుడీ ప్రభుత్వ పనితీరులోనూ కేసీఆర్ ముందజలో ఉండగా… ఏపీలో చంద్రబాబు ఆ స్థాయిలో మద్దతు దక్కలేదు. అయితే ఈ సర్వే ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో బెస్ట్ లీడర్ ఎవరు అనే దానికి సీఎం కేసీఆర్ అత్యధిక మార్కులు పడ్డాయి. సుమారు 43 శాతం మంది కేసీఆర్‌ను తమ లీడర్‌గా ఎన్నుకున్నారు. తర్వాత ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 18 శాతం మంది, కిషన్‌కుమార్ రెడ్డికి 15 శాతం మంది జై కొట్టారు. ఇదే కాదు… ప్రభుత్వ పనితీరులో టీఆరెస్ సర్కార్ అత్యధిక మార్కులే పడ్డాయి. కేసీఆర్ సర్కార్‌కు బాగుందని 48 శాతం మంది బాగుంది అంటే..16 శాతం మంది పర్వాలేదు అన్నారు. ఇక 25 శాతం మంది బాగా లేదన్నారు. ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ కంటే మోదీకి పాపులారిటీ ఎక్కువగా ఉంది. 44 శాతం మంది మోదీకి జై కొడితే 39 శాతం మంది రాహుల్‌కి జై కొట్టారు.
ఇక ఏపీలోనూ సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు పాపులారిటీ పడిపోయింది. జగన్ వ్యూహాత్మకంగా వృద్ధి సాధించారు. మీ లీడర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది జగనే మా లీడర్ అని చెప్పారు. కేవలం 38 శాతం మాత్రమే చంద్రబాబు మా నాయకుడు అన్నారు. 5 శాతం మంది పవనే మా లీడర్ అని జై కొట్టారు. ఇక చంద్రబాబు పనితీరుకు పెద్దగా మార్కులు పడలేదు. 33 శాతం మంది బాగుంది అంటే…18 శాతం మంది పర్వాలేదు అని.. 38 శాతం మంది బాగాలేదని చెప్పారు. అయితే ఇక్కడ మోదీ కంటే రాహుల్‌కి గ్రాఫ్ పెరిగింది. ఇందులో మోదీకి జై కొట్టిన వాళ్ల శాతం 38 ఉంటే రాహుల్‌కి 44 శాతం మంది జై కొట్టారు. మొత్తంగా ఈ సర్వే ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.