శ్రీశైల జలాశయ పర్యటనకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాంబ్ స్వ్కాడ్ పోలీసులు విదేశీ శునకంతో తనిఖీలు చేపట్టారు. బెల్జియం మెల్నాయిస్‌కు చెందిన శునకాన్ని శ్రీశైలం బందోబస్తులో వినియోగిస్తున్నారు. డానీగా పిలువబడే ఈ శునకాన్ని నెల్లూరు జిల్లా నుంచి పోలీసులు తీసుకువచ్చారు. శిక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించి ఈ శునకం మొదటి బహుమతి పొందినట్లు పోలీసులు చెబుతున్నారు. అత్యంత చురుకుదనం కలిగి ఉండడం, అలసట లేకుండా విశ్రాంతి తక్కువగా తీసుకోవడంతో పాటు లక్ష్య ఛేదనకు ఈ శునకం ప్రాధాన్యత ఇస్తుందరి చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం బెల్జియం మెల్నొయిస్ చెందిన 8 శునకాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. మొట్టమొదటిసారిగా ఈ శునకాన్ని శ్రీశైలంలో సీఎం భద్రతలో వినియోగిస్తున్నారు
