Home / 18+ / చంద్రబాబు అరెస్ట్ వారంట్‌పై కన్నా సంచలన వ్యాక్యలు

చంద్రబాబు అరెస్ట్ వారంట్‌పై కన్నా సంచలన వ్యాక్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారని వెల్లడించారు.

ఇప్పటికే ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు,దేవినేని ఉమామహేశ్వర రావు మరియు 15 మంది తెలుగుదేశం నేతలకు అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat