చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఎక్కడైనా మంచి జరిగితే తన గొప్పదనమని డప్పేసుకోవటం, అదే తన వైఫల్యాన్ని ప్రత్యర్ధుల ఖాతాలో వేసి బురదచల్లటం కూడా అందరికీ అనుభవమే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సంకల్ప బలంతో మొదలుపెట్టారని అప్పటికేదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తానే ఆరభించినంత బిల్డప్ ఇస్తున్నారు. వైఎస్ హయాంలోనే చాలా పనులు జరిగిన విషయాన్ని అంగీకరించటాన్ని చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడటం లేదు.
కేంద్రం సహకరించి ఉంటే ఇంకా ఎంతో ముందుకెళ్ళే వారట. అయినా కానీ ప్రాజెక్టు పనులను వేగంగా జరుపుతున్నారట. . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు చేతకానితనం వల్లే ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తున్నాయన్న విషయం అందరికీ తెలుసు.
ప్రాజెక్టు పూర్తయితే తన గొప్పతనమని, లేకపోతే జనాల పరాజయమని ఎంత తెలివిగా చెబుతున్నారో ?
ఇది ఇలా ఉంటే బుధవారం గ్యాలరీ వాక్‌ను ఫ్యామిలీ పిక్నిక్‌లా మార్చేశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్లతో కలిసి ప్రాజెక్టులోని గ్యాలరీలో నడిచారు.సీఎం చంద్రబాబు కేవలం ప్రచారం కోసం పాకులాడుతూ ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి, గ్యాలరీ వాక్ పేరిట హంగామా చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.