వాట్సాప్…ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమం.ఎందుకంటే వాట్సాప్ ఉపయోగం అలాంటిది.స్నేహితులు,బంధువులతో టచ్ లో ఉండాలన్నా…మెసేజ్,వీడియోలు పంపుకోవాలన్నవాట్సాప్ మించిన ఆప్షన్ లేదు.అయితే కొందరు వీటినుండి నానా పనికిమాలిన మెసేజీలు, వీడియోలతో యూజర్లకు చిరాకు తెప్పిస్తు దుర్వినియోగం చేస్తున్నారు.ఈ మేరకు ప్రభుత్వం చేపట్టే నిబంధనలతో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ మీడియాపై పరోక్షంగా ఆంక్షలు అమల్లోకి వస్తునాయి.అయితే ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే వర్తించే నిషేధం.
ఎన్నికల టైం దగ్గరపడుతుండంతో పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రకటనలు, మార్ఫింగ్ ఫొటోలు, సమాచారంతో వాట్సాప్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ప్రజాతీర్పును ప్రభావితం చేయడమే కాదు, అల్లర్లకు ఇతర దారుణాలకు దారితీసేలా ఉండడంతో ఎన్నికల సంఘం కత్తి తీసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ ద్వారా మెసేజీలు పంపకూడదని నిషేధం విధించింది. పార్టీలు ఆ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.రాత్రి 10 గంటలు దాటితే ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదనే నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. దీన్ని సోషల్ మీడియాకే కాకుండా ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఫోన్ కాల్స్‌కు వర్తింపజేసింది ఈసీ.