తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది.కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, భరోసాయిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో చినగదిలి వద్ద ఈ మధ్యాహ్నం జరిగే ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు.
