వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. మాచపత్రి,గరిక,ఉత్తరేణి,ములక,ఉమ్మెత్త,తులసి,మారేడు,రేగు,మామిడి,గన్నేరు,ధవనం,మరువం,జమ్మి,విష్ణుక్రాంత పత్రం,వావిల,రావి,దానిమ్మ,జాజిమల్లి,మద్ది,దేవదారు పత్రం,లతాదూర్వా,జిల్లేడు.
బాధ్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.
మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగ ఆచరిస్తారు. నేపాల్, అమెరికా, కెనడా, మారిషస్, సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, బర్మా, ఫిజీ దేశాల్లో హిందువులు పండుగ ఆచరిస్తారు.