ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం అవుతున్నట్లు అందరికి తెలిసింది.తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు.
డిసెంబరు రెండో వారానికల్లా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, మూడో వారంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పక్రియను వేగవంతం చేసిన ఎన్నికల సంఘం అక్టోబర్ 8 కల్లా ఓటరు జాబితా తుది ముసాయిదాను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈమేరకు ఎన్నికల సంఘం అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నదని తెలుస్తుంది.