చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి ఢీ కొట్టింది. కొన్ని అడుగుల దూరం ఆమెను లాక్కుపోయింది. ద్విచక్రవాహనం ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. నడుపుతున్న మహిళ కూడా చనిపోయిందని చుట్టుపక్కల వారు అనుకున్నారు. కానీ విచిత్రంగా ట్రక్కు వెనుక భాగం నుంచి పెద్ద గాయాలేవీ లేకుండా ఆమె నడుస్తూ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన నెటిజన్లు సదరు మహిళ చాలా అదృష్టవంతురాలని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
WATCH: Woman miraculously survives after being run over by a truck. CCTV camera captured the dramatic footage in Maoming, south China's Guangdong province. pic.twitter.com/2ZZ13Yc3TC
— People's Daily,China (@PDChina) September 11, 2018