ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని.. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకు కేటాయించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. రాజధాని బాండ్ల వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, బాండ్ల కొనుగోళ్లలో వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఈజడ్‌లకు వేల ఎకరాలు కేటాయించారని… దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మించాలని మధు పట్టుబట్టారు…మీ అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు నష్టపోతున్నారని మండిపడ్డారు.