ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు మహాకూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసినట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది.ఆయుధ చట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట్రమణారెడ్డిపైన కూడా పోలీసులు సోమవారం రాత్రి ఆయుధ చట్టం క్రింద కేసు పెట్టారు.బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇళ్ల స్థలాలు అమ్మారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో 2003 నుంచి 2005 వరకు ఉన్న హౌసింగ్ సొసైటీ కమిటీకి సీఆర్పీసీ 41 కింద జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో రేవంత్ రెడ్డి సహా 13 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే వీళ్ళు 15 రోజుల్లో కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.