టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యామని అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, మల్లంపల్లి, కొండాపురం, గణేశ్ కుంట, పాలకుర్తి గ్రామాలకు చెందిన 300 మందితో పాటు దేవరుప్పులలోని బస్టాండ్ కాలనీకి చెందిన 20 కుటుంబాలకు గులాబీ కండువా కప్పి దయాకర్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష సభ్యుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని అన్నారు.
