తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పాలన ఎలా ఉందో ప్రజలకే..కాదు యావత్తు దేశానికే తెలుసు. దేశ ప్రధానినే ఆశ్యర్యపోయారు ..ఇతర ముఖ్యమంత్రులతో..సీనియర్ నేతలతో మీటింగ్ లో , భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాలన చాల బాగుంది..ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు బాగా అందాయి..ఇలా ఒక్కరు కాదండి..ప్రతి ఒక్కరు మెచ్చుకున్నవారే. ఇందులో బాగంగానే కేసీఆర్ వేంట నడవాలని..మళ్లి ఆయనే రావలని స్వచ్చందంగా ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన రజక కులస్థులు మంత్రి ఈటల రాజేందర్‌కే మా ఓటు అని ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 400 మంది ప్రతిజ్ఞ చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడంతో రజక కులస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్వచ్చందంగా ముందుకొచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈటల రాజేందర్‌కే ఓటు వేస్తామని ప్రతిజ్ఙ చేశారు. రజక కులస్థులను ఆదర్శంగా తీసుకున్న మిగతా కులాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొలిపాక రాములు, కొలిపాక సాంబయ్య, దేవరాజు ముత్తయ్య, సారయ్య, వీరయ్య, శివశంకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
