వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామస్తులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.రజకులను ఆదర్శంగా తీసుకు న్న మిగతా కులాలు సైతం ఏకగ్రీవ తీర్మానాలకు కసరత్తు మొదలుపెట్టాయి.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొలిపాక రాములు, కొలిపాక సాంబయ్య, దేవరాజు ముత్తయ్య, సారయ్య, వీరయ్య, శివశంకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.