తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి అనుగుణంగా టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని పొత్తుల కోసం సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.పొత్తులపై ఇతర పార్టీలతో సంప్రదింపుల కమిటీ చర్చలు ప్రారంభించకముందే ఈసీ రూపంలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది.
నవంబరులో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న సన్నాహాలతో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలినట్లయింది. ఈ షాక్‌ల నుంచి తేరుకోకముందే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి నెలకొంది.దీంతో కాంగ్రెస్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచు.కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవకాశాలు వచ్చినా కార్యకర్తలను పట్టించుకునే వారు లేకపోవడంతో పార్టీ నుండి వలసపోతున్నారు.