అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. ఉత్తమ్ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఉత్తమ్ ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ అనుచరులు, కేటీఆర్ అభిమానులు విపరీతంగా ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను అవమానించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. డియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మీలీటరిలో ఉన్నప్పుడు ఎవరి పనులు వారు చేసుకోవాలని నేర్పలేదా…ఇంట్లో అమ్మ నాన్నాలకు సహాయం చేస్తే తప్పా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. వేంటనే ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని న్యూజీలాండ్ నుండి తెలంగాణ ఎన్నారై TRSNZ మెంబర్ సీప్ ఇంచార్జ్ పోకల కిరణ్ డిమాండ్ చేశారు. వీరితో పాటు దేశ వ్యాప్తంగా కొన్నివేల మంది మేము తిన్న తర్వాత మా ప్లేట్లను మేమే శుభ్రం చేసుకుంటానని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నారైలు ఉత్తమ్ పై చేసిన వాఖ్యలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.