తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను అభ్యర్థులను కూడ ప్రకటించడంతో ఒక్కసారిగా పత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు ఉదహారణ ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకుండా సతమతం అవ్వడం. నిజం చెప్పాలంటే.. ఒంటరిగా కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్క ప్రతిపక్షానికీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే అందరూ పొత్తులు ఖరారయ్యే దాకా అడుగు ముందుకు వేసే పరిస్థితిలో లేరు. అందుకే ఇప్పటికీ పొత్తుల సంగతి తేల్చుకోడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. కేసీఆర్ ను ఓడించడం అసాధ్యం అన్నట్లుగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నట్లుగానే తెలుస్తోంది. టీఆర్ఎస్ చాలా చాలా బలంగా ఉన్నదని, అందుకే అందరూ కలిస్తే తప్ప ఎదుర్కోలేం అని ప్రత్యర్థులే భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు
