విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగింది. వైయస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభ వీక్షణకు నగరంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్ పార్కు, సీఎంఆర్, సెంట్రల్ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సభకు ఈసందర్భంగా కంచరపాలెం సభలో జగన్ మాట్లాడుతూ నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్ గేర్ లో ప్రయాణం చేస్తే, చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో ప్రయాణం చేస్తోందన్నారు.
ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజితో సహా అనే కార్యక్రమాల కోసం 1500 కోట్ల రూపాయలతో అభివృద్ది చేశారన్నారు. వైఎస్ హయాంలో ఏకంగా 15 చోట్ల 15 కాలనీలు రాగా.. 35వేల ఇళ్లు కట్టించారన్నారు. అప్పట్లో కొన్ని వందల కుటుంబాలని రోడ్డున పడకుండా కాపాడటమే కాకుండా, షిప్ యార్డు కూడా నష్టాల ఊబిలో ఉంటే, రక్షణ శాఖలో విలీనం చేయించారు. దువ్వాడ ఐటి క్యారిడార్, పరవాడలో ఫార్మా సిటీ,ఎస్ఇజెడ్, ఎక్కడ చూసినా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయంటే, ఆ రోజు మహానేత వైయస్ఆర్ చూపిన చొరవే కారణమన్నారు. ఎన్నికలప్పుడు విశాఖకు రైల్వే జోన్ అని ఊదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాల పాటు కేంద్రంలో బిజెపితో సంసారం చేసినప్పుడు , రైల్వే జోన్ గుర్తుకు రాలేదు, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు.
నాన్నగారు కట్టిన స్టేడియం మాత్రమే కనిపిస్తోందన్నారు. హుదుద్ తుఫానును జయించామని చెప్పుకున్నా, 25 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని నిర్దారిస్తే , ఇప్పటి వరకు 4 వేల ఇళ్లు మాత్రమే కట్టారు. 5 ఏళ్లలో 35 వేల ఇళ్లను మహానేత చిరస్మరణీయుడయ్యారు. విశాఖ పరిస్థితి ఎలా ఉందంటే క్రైం రేటు 2015 ఏకంగా 16 హత్యలు జరిగాయి. 2016 లో 29 హత్యలు 2017వో 27 హత్యలు 2018 లో ఇప్పటి వరకు 12 హత్యలు జరిగాయంటే, ఏ స్థాయిలో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారో ఇంతకంటే రుజువులేం కావాలి. మొత్తంగా కంచరపాలెం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైయస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.
రాబోయే రోజుల్లో చంద్రబాబును గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కంచరపాలెం సభ తేటతెల్లం చేస్తుందన్నారు. విశాఖలో జగన్ సభ చ్రరితలో నిలిచిపోతుందన్నారు. ప్రజా స్పందన చూస్తే వైయస్ జగనే కాబోయే ముఖ్యమంత్రి అనేది ప్రస్ఫుటమవుతుందన్నారు. విశాఖకు రైల్వేజోన్‌తో పాటు ఉత్తరాంధ్రకు ప్రత్యేకప్యాకేజీ జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు వైయస్ జగన్‌లో రాజన్నను చూసుకుని మురిసిపోతున్నారన్నారు.