తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎప్పుడైయితే ప్రకటించాడో అప్పటి నుండి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో కాంగ్రెస్ నేత కేసీఆర్ లోకి వలస వస్తున్నట్లు సమచారం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందని తెలుస్తుంది. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండారి లక్ష్మా రెడ్డి బుధవారం కేసీఆర్ కారు ఎక్కనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం దారుణమని, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని, టీడీపీ నుండి వీరేందర్ గౌడ్ కి ఉప్పల్ నియోజకవర్గం టికెట్ కేటాయిస్తునట్లు,కాంగ్రేస్ పార్టీ నాయకులు తెలుపడంతో పార్టీ మారాలని నిర్ణహించుకున్న బండారి లక్ష్మా రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం టి.ఆర్.ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాని సహచరులతో చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
