తెలంగాణ జేఏసీ రథసారథిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జనసమితిలో కలకలం మొదలైంది. ఆయన పార్టీలో లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతలు సైతం తమ ఆవేదనను మీడియా ముఖంగా వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన జ్యోష్న పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె సోమవారం మీడియా ముందుకు రానున్నారని సమాచారం.
టీజేఎస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా టీజేఎస్ నాయకురాలు సుష్మా ఉదంతం తెరమీదకు వచ్చింది. పార్టీలోని పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సుష్మా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీలో వ్యాపారం నడుస్తుందని ఆరోపణ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి టీజేఎస్ లో జరుగుతున్న భాగోతం బట్టబయలు చేస్తానంటూ పలు మీడియా సంస్థలతో జ్యోష్న వెలువరించినట్లు తెలుస్తోంది.