తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి పొత్తు ప్రకటించేందుకు ఇరుపార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు దాసోహం చేస్తున్నారు. ఆరెండు పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్.
దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో…కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం భూస్థాపితం అయ్యింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయి.
ఈ అక్రమ కలయికతో టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30నుంచి యాభైమంది నేతలు పార్టీకి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఆపార్టీ సీనియర్లు కేఈ, అయ్యన్నలనుంచి తాజాగా ఎమ్మెల్యేలు అయిన చాలామంది నేతలు బాహాటంగానే ఈ పొత్తును వ్యతిరేకించడం తెలిసిందే.